![]() |
![]() |
.webp)
వీజే సన్నీ తన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా టేస్టీ తేజతో కలిసి ఓ వీడియో చేశాడు. అందులో ఓ స్విమ్మింగ్ పూల్ దగ్గర స్విమ్ చేయడానికి తేజ, సన్నీ నిల్చున్నారు. అరెయ్ అందులో చూడు చిన్న చేప అని సన్నీ అనగా.. ఎక్కడ అన్న అని తేజ అడిగాడు. అరెయ్ సరిగ్గా చూడురా అక్కడ ఉందని సన్నీ అనగా.. అప్పుడు రియలైజ్ అయ్యాడు. అది చేప కాదని ఇంకేంటో అని తేజ ఒకటే నవ్వు నవ్వుతూ ఉన్నాడు.
ఇక ఇది వీజే సన్నీ తన ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్ట్ చేయగా అది ఇప్పుడు ఫుల్ వైరల్ గా మారింది. ఈ వీడియోకి ప్రియాంక జైన్ సిగ్గుపడుతున్నట్టుగా ఓ స్మైలీ ఈమోజీని కలిపి కామెంట్ గా చేసింది. ఇక ఆ వీడియోతో పాటు ప్రియాంక జైన్ కామెంట్ కూడ తెగ ట్రెండింగ్ అవుతోంది. బిగ్ బాస్‌తో గుర్తింపు తెచ్చుకున్న వీజే సన్నీ హీరోగా పలు సినిమా ఛాన్సులు దక్కించుకుంటున్నాడు. వీజే సన్నీ, హ్రితిక శ్రీనివాస్ జంటగా నటిస్తున్న సినిమా 'సౌండ్ పార్టీ'. రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మాతలు. సంజయ్ శేరి దర్శకత్వం వహించారు.
టేస్టీ తేజ ఈ మధ్య ఫుడ్ వ్లాగ్స్ తో పాటు సినిమా ప్రమోషన్స్ జోరుగా చేస్తున్నాడు. దీంతో వీజే సన్నీ అతనితో కలిసి ఇలా ప్లాన్ చేశాడు. డెఫినెట్లీ ఇది వైరల్ అవుతుందని విజే సన్నీ గట్టిగా ప్లాన్ చేశావ్ మైక్ అంటు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరి మీలో ఎంతమంది ఈ వీడియోని చూశారు. ఓటీటీలోకి వచ్చిన సౌండ్ పార్టీ మూవీకి మంచి వీక్షకాధరణ లభిస్తోంది. ఇప్పుడు ఈ వీడియోతో మరింత క్రేజ్ వచ్చేసింది.
![]() |
![]() |